Venkatesh’s Narappa first glimpse ready

Saturday,December 12,2020 - 11:07 by Z_CLU

విక్టరీ Venkatesh, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న 'Narappa' టీజర్ రెడీ అయింది. ఈరోజు రాత్రి 8 గంటలకు వెంకీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వదలబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ , స్టిల్స్ లో తన గెటప్ తో అందరినీ ఆకట్టుకున్న వెంకీ నేటి నుండి టీజర్ తో హంగామా చేయబోతున్నాడు.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన 'అసురన్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది నారప్ప. ఒరిజినల్ లో ధనుష్ లుక్ ని అచ్చుగుద్దినట్టు దింపేశాడు వెంకీ. అయితే నటనలో ధనుష్ ని మించి వెంకీ డ్రామా పండిస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సినిమా అంతా ఎమోషనల్ గా సాగే యాక్షన్ డ్రామా కావడంతో ఈ కథతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ కొడతాడని ఆశిస్తున్నారు. మరి ఈ టీజర్ తో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ అంచనాలు పెంచబోతున్నాడు వెంకీ.

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ సంస్థలపై సురేష్ బాబు , కలైపులి థాను ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వెంకటేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు మణిశర్మ.

also Check - నారప్ప అప్ డేట్స్