Venkatesh’s Drishyam 2 Movie regular shoot started

Wednesday,March 17,2021 - 12:55 by Z_CLU

ఇటివలే OTT లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న దృశ్యం 2 ని తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ని మొదలు పెట్టేసాడు వెంకటేష్. ప్రస్తుతం సికింద్రబాద్ లోని లీ ప్యాలెస్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. షూటింగ్ లో వెంకటేష్, మీనా లతో పాటు నదియా, నరేష్, సంపత్ రాజ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.

Drishyam 2 venkatesh meena

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. దృశ్యం 2 మొదటి షెడ్యుల్ పూర్తయిన వెంటనే f2 షూటింగ్ లో పాల్గొంటాడు వెంకీ.

నారప్ప, F2, దృశ్యం సినిమాలతో ఈ ఏడాది విక్టరీ అభిమానులను మరింతగా అలరించబోతున్నాడు దగ్గుబాటి హీరో. మరి వీటితో వెంకటేష్ ఎలాంటి విక్టరీలు సాధిస్తాడో చూడాలి.