Venkatesh , Varun Tej’s ‘F3’ Trailer Review

Monday,May 09,2022 - 12:38 by Z_CLU

మూవీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సీక్వెల్  'F3' రిలీజ్ కి రెడీ అవుతుంది. మే 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రైలర్ తో F3 హంగామా కనిపిస్తుంది.

"ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు.. కానీ ఆరో భూతం ఒకటుంది..అదే డబ్బు" అంటూ మురళి శర్మ వాయిస్ ఓవర్ తో స్టార్టయిన ట్రైలర్ లో విందు భోజనంలా అన్ని వడ్డించి సినిమా  మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా సినిమాలో వెంకీ కి 'రే చీకటి' , వరుణ్ కి 'నత్తి' ఉంటుందని  సీన్స్ తో  చూపించేసి ఆ సీన్స్ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయనున్నాయని ట్రైలర్ తో హింట్ ఇచ్చేశాడు అనిల్.

 ఫన్ & ఫ్రస్ట్రేషన్ తో పాటు అనిల్ రావిపూడి ఈసారి ఫైనాన్స్ ఎలిమెంట్ మీదే ఎక్కువ బేస్ అయి ఈ సీక్వెల్ ను తీసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ తో పాటు కేరెక్టర్స్ బిహేవియర్ అందులో నుండి వచ్చే ఫన్ ఎలా ఉండబోతుందో చూపించారు. "డబ్బున్న వాడికి ఫన్ ..లేనివాడికి  ఫ్రస్ట్రేషన్ అంటూ మురళి శర్మ డైలాగ్ పూర్తవ్వగానే అన్నపూర్ణమ్మ  బ్యాచ్ "వీ ఆర్ బ్యాక్" అంటూ హోటల్ ముందు నిలబడి చెప్పడం ఈ సీక్వెల్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసేలా చేసింది. సినిమాలో హోటల్ బిజినెస్ తో వచ్చే కామెడీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ కడుపుబ్బా నవ్వించడం ఖాయమనిపిస్తుంది. అలాగే  మనీ ప్లాంట్ తో చేసిన వంటలతో వచ్చే కామెడీ సీన్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సీక్వెల్ లో వెంకీ , వరుణ్ కేరెక్టర్స్ తో పాటు మిగతా కేరెక్టర్స్ కూడా హిలేరియస్ ఫన్ క్రియేట్ చేసి హాస్య ప్రేమికులకు ఫుల్ మీల్స్ పెట్టనున్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి  F3 తో F2 ని మించి ఎంటర్టైన్ చేయబోతున్నాడని థియేట్రికల్ ట్రయిలర్ తో చెప్పకనే చెప్పాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరున థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేయబోతుంది.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics