Venkatesh , Varun Tej’s ‘F3’ Trailer launch date announced

Monday,May 02,2022 - 01:27 by Z_CLU

వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'F3' రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మే 27 న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కట్ రెడీ చేస్తున్నారు. సినిమాలో ఉండే ఫన్ ఎలిమెంట్స్ తో టీం ఓ హిలేరియస్ ట్రయిలర్ ప్లాన్ చేస్తూ దాని మీద వర్క్ చేస్తుంది.

'F2' కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.  సినిమాలో వెంకీ , వరుణ్ లతో పాటు సునీల్ కేరెక్టర్ కూడా హిలేరియస్ వర్కౌట్ అయిందని ఇన్సైడ్ టాక్. అలాగే అనిల్ రావిపూడి F2 కంటే ఎక్కువ ఫన్ కంటెంట్ తో ఈ సీక్వెల్ ను ఫిల్ చేశాడని అంటున్నారు. ముఖ్యంగా వెంకటేష్ కి రే-చీకటి , వరుణ్ తేజ్ కి నత్తి తో వచ్చే ఎపిసోడ్స్ థియేటర్స్ లో నవ్వులు పూవులు పూయించడం పక్కా అని తెలుస్తుంది.

https://twitter.com/SVC_official/status/1520986104022794240

 

తాజాగా మేకర్స్ ట్రైలర్ తో ఫన్ బాంబ్ పేలనుందని ఓ అప్ డేట్ వదిలి మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొలిపారు. హైదరాబాద్  AMB థియేటర్ లో  మే 9న ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కి వెంకటేష్ , వరుణ్ , తమన్నా , మెహ్రీన్ లతో పాటు టీం కూడా హాజరు కానున్నారు.  ఈ హిలేరియస్ ట్రయిలర్ సినిమాపై అంచనాలు పెంచి బజ్ క్రియేట్ ఖాయమనిపిస్తుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics