Venkatesh-Rana Movie on cards

Monday,November 09,2020 - 10:34 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ పై ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి మోస్ట్ ఎవైటింగ్ కాంబినేషన్స్ లో Venkatesh - Rana కాంబో కూడా ఒకటి. ఈ కాంబోలో మంచి సినిమా రావాలని ఎదురుచూస్తున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరబోతుంది. వెంకీ -రానా కాంబోలో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు రానా.

Suresh Productions బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు రానా. గతంలో రానా హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో ఓ సాంగ్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు వెంకీ. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపించలేదు.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఓ కథతో ఇద్దరు కలిసి పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ దగ్గుబాటి మల్టీ స్టారర్ సినిమాను ఏ దర్శకుడు హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

Also Check - వెంకీ మూవీ అప్ డేట్స్