Varun Tej’s ‘Ghani’ Anthem song released !

Wednesday,October 27,2021 - 12:38 by Z_CLU

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న 'గని' సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. 'Ghani Anthem' అంటూ విడుదలైన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. తన సాహిత్యంతో ఈ సాంగ్ ని అందరూ ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాడు రామజోగయ్య శాస్త్రి. అలాగే తమన్ ట్యూన్  కూడా సాంగ్ కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఆదిత్య , శ్రీ కృష్ణ , సాయి చరణ్ , పృద్వీ సింగింగ్ కూడా బాగుంది.

సినిమాలో వరుణ్ కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. తను బాక్సింగ్ లో ట్రైనింగ్ అవుతున్న సిచ్యూవేషణ్ లో వచ్చే సాంగ్ ఇది. అందుకే దీనికి గని ఆంథెం అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు.

సాంగ్ లో విజువల్స్ , ఫొటోస్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి తమ్ముడు సినిమాలో పవన్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు వచ్చే సాంగ్ గుర్తురావడం ఖాయం. అప్పట్లో ఆ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది. మరి గని ఆంథెం కూడా ఆ రేంజ్ లో జనాల్లోకి వెళ్తుందా ? చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics