Varun Tej’s Action Entertainer #VT12 Shoot Begins in London
Monday,October 10,2022 - 05:30 by Z_CLU
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న #VT12 సినిమా షూటింగ్ మొదలైంది. ఈరోజు నుండి లండన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమా టోటల్ షూట్ అక్కడే జరగనుంది.
జెన్ నెక్స్ట్ కథతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించనున్నాడు ప్రవీణ్ సత్తారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో వరుణ్ తేజ్ గన్స్ పట్టుకుంటూ వాటితో రిహార్సల్స్ చేస్తుండటం చూస్తే సినిమా ఎంత స్టైలిష్ గా ఉండనుందో అర్థమవుతుంది. ఈ సినిమా ద్వారా ఓ బ్యూటిఫుల్ మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రవీణ్ సత్తరు ప్రకటించాడు. ఆ సందేశం వరల్డ్ కి రిలేటెడ్ గా ఉంటుందని చెప్పాడు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
సినిమాటోగ్రఫీని ముఖేష్ హ్యాండిల్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.