Varun Tej, Vijay Deverakonda ignores BOXER Title

Thursday,January 21,2021 - 01:20 by Z_CLU

బాక్సర్.. నికార్సైన మాస్ టైటిల్. ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది. రీసెంట్ గా 2 సినిమా యూనిట్స్ మధ్య ఈ టైటిల్ తెగ చక్కర్లు కొట్టింది. కట్ చేస్తే, ఇప్పుడు ఎవ్వరూ ఈ టైటిల్ ను పెట్టుకోలేదు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం

విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే బాక్సర్ అనే టైటిల్ పై కూడా బజ్ నడిచింది. కట్ చేస్తే, ఈ రెండు టైటిల్స్ పక్కనపెట్టి లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

విజయ్ దేవరకొండ సినిమా కాస్త బెటర్. వరుణ్ తేజ్ సినిమాకైతే బాక్సర్ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇక అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యంగా వాళ్లు కూడా బాక్సర్ ను పట్టించుకోలేదు. తమ సినిమాకు గని అనే టైటిల్ పెట్టుకున్నారు.

ఇలా బాక్సర్ అనే టైటిల్ రెండు సినిమాలకు చెందకుండా పోయింది.