Varun Tej Speech at F3 Movie Pre Release function

Sunday,May 22,2022 - 11:44 by Z_CLU

ఎఫ్3 మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "ఎఫ్ 3 అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నికల్ టీం కి థ్యాంక్స్. ఈ సినిమాలో సునీల్ గారితో నా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు. దిల్ రాజు, శిరీష్ గారి సినిమా అంటే నా హోం ప్రొడక్షన్ లా ఫీలౌతా. ఫిదా, ఎఫ్ 2 లాంటి సూపర్ హిట్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేశాను. ఎఫ్ 3తో హ్యాట్రిక్ కోడతామనే నమ్మకం వుంది. ప్రొడక్షన్ టీం అద్భుతంగా పని చేసింది. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి నా బ్రదర్ , అద్భుతమైన వ్యక్తి. ప్రస్తుత కాలంలో అనిల్ అంత కామెడీ ఎవరూ పండించలేరని నా నమ్మకం. ఎఫ్ 3తో మళ్ళీ అది ప్రూవ్ చేస్తారు. వెంకటేష్ గారితో రెండోసారి చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయనతో నా ప్రయాణం మర్చిపోలేను. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది''.