Varudu Kavalenu first single out !

Monday,February 15,2021 - 04:38 by Z_CLU

సిద్ శ్రీరామ్ లేటెస్ట్ సూపర్ హిట్స్  లిస్టులో మరో సాంగ్ చేరింది.  నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో వస్తున్న 'వరుడు కావలెను' సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. "కోలకళ్ళే ఇలా" అంటూ సాగే ఈ పాటను విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేయగా సింగింగ్ సెన్సేషన్  సిద్ శ్రీరామ్ పాడాడు.

‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా

నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా

కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా

మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే‘‘ అనే సాహిత్యంతో సాగే ఈ పాటకు  రాంబాబు గోసల సాహిత్యం అందించాడు.

వాలెంటైన్స్ స్పెషల్ గా రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ కి ఆకట్టుకుంటూ లేటెస్ట్ హిట్ సాంగ్స్ లిస్టులో చేరిపోయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా మే లో రిలీజ్ కానుంది.