Varudu Kaavalenu Pre Release function details

Monday,October 25,2021 - 06:22 by Z_CLU

నాగశౌర్యరీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్‌ను మేకర్స్‌ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దానికి హీరో దగ్గుబాటి రానా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. శనివారం సంగీత్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హాజరైంది. ఇప్పుడు ఇదే ఊపులో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.

రేపు (October 27) హైదరాబాద్ లో వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), హీరోహీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్.. ఈ ఈవెంట్ లో మెరవనున్నారు.

ఈ సినిమాలో ఆకాష్ గా శౌర్య, భూమిగా రీతూ వర్మ నటించారు. ఇద్దరి పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతా అనుకుంటున్నట్టు ఇదేదో రొటీన్ లవ్ స్టోరీ, లేక పెళ్లి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫ్యామిలీ సినిమా మాత్రమే కాదు.. అంతకుమించి ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయని అంటున్నారు డైరక్టర్ లక్ష్మీ సౌజన్య.

నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics