Varalakshmi Sharath Kumar key role in NBK107 !

Thursday,January 06,2022 - 03:02 by Z_CLU

కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసిన నటీ నటులను ఆ పాత్రల పేర్లతోనే పిలుస్తుంటారు.  తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా జయమ్మగా తెలుగు ప్రేక్షకుల చేత పిలువబడుతుంది. దానికి కారణం 'క్రాక్' సినిమా. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి జయమ్మ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. తనదైన స్టైల్ లో మంచి విలనిజం పండించింది.

దాంతో ఆమె పేరు జయమ్మగా మారిపోయింది. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలో కూడా జయమ్మ ని రిపీట్ చేయబోతున్నాడు దర్శకుడు గోపీచంద్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ సినిమా #NBK107 లో వరలక్ష్మి ఓ కీ రోల్ లో కనిపించనుంది. తాజాగా సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలియజేస్తూ ఆమెకి వెల్కం చెప్పారు యూనిట్.

మరోసారి గట్టిగా మాట్లాడుకునే పాత్రలో వరలక్ష్మి కనిపించనుందని హింట్ ఇచ్చారు కూడా. దీంతో ఇప్పుడు బాలయ్య సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండనుందో ? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జనవరి ఎండింగ్ లో లేదా ఫిబ్రవరిలో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. మరి 'క్రాక్' సినిమాలో వరలక్ష్మిని పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తూ మెస్మరైజ్ చేసిన గోపీచంద్ ఈసారి ఆమెని ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics