VakeelSaab to release on April 9?

Thursday,December 31,2020 - 05:10 by Z_CLU

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న VakeelSaab థియేటర్స్ లోకి వచ్చేది. కానీ కరోన కారణంగా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడీ సినిమా విడుదల తేదిను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.

అవును ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దిల్ రాజు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ తో ఈ డేట్ గురించి డిస్కషన్ జరిపారట.

వచ్చే నెల సంక్రాంతి నుండి సినిమా సీజన్ స్టార్ట్ అవ్వనుంది. మెల్ల మెల్లగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారు. ఇవన్ని ద్రష్టిలో పెట్టుకొనే పవన్ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారట. పైగా అది మెగాస్టార్ ఘరానా మొగుడు రిలీజ్ డేట్ కూడా కావడంతో సెంటిమెంట్ గా భావిస్తారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రానుంది