Vakeel Saab Trailer to release today at 6PM

Monday,March 29,2021 - 08:51 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ వకీల్ సాబ్ ట్రయిలర్ మరికొన్ని గంటల్లో రాబోతోంది. దిల్ రాజు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ పై సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ అవ్వడంతో వకీల్ సాబ్ పై భారీ అంచనాలున్నాయి.

హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తోంది వకీల్ సాబ్. అయితే ఆ పింక్ కు, ఈ వకీల్ సాబ్ కు అస్సలు పోలిక ఉండదు. కేవలం స్టోరీలైన్ మాత్రమే తీసుకున్నారు. పవన్ ఇమేజ్, మేనరిజమ్స్, స్టార్ డమ్ కు తగ్గట్టు పూర్తిగా మార్పులు చేశారు. ఫైట్స్ యాడ్ చేయడంతో పాటు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పెట్టారు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేత థామస్, అనన్య నాగళ్ల, అంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు వకీల్ సాబ్.