Vakeel saab teaser update
Sunday,November 08,2020 - 12:21 by Z_CLU
Pawan Kalyan రీఎంట్రీ మూవీపై నడుస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. ఒక్క స్టిల్ బయటకొచ్చినా చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాంటిది టీజర్ పై హైప్ ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ వకీల్ సాబ్ టీజర్ పై యూనిట్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
నిజానికి Vakeel Saab Teaser దసరాకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్లాన్స్ నుంచి యూనిట్ వెనక్కితగ్గింది. దీంతో దీపావళికి టీజర్ ఫిక్స్ అయింది.
అయితే ఇది అన్-అఫీషియల్ మాత్రమే. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం దీపావళి ఫిక్స్ అయినప్పటికీ.. టీజర్ దీపావళికి వస్తుందనే విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.
ప్రస్తుతం దీపావళి వీక్ లోకి ఎంటరయ్యాం. సో.. రేపోమాపో వకీల్ సాబ్ టీజర్ అలెర్ట్ రావడం గ్యారెంటీ.