Vakeel Saab Teaser Release Postponed

Thursday,October 22,2020 - 05:01 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ తర్వాత చేస్తున్న Vakeel Saab సినిమాకు సంబంధించి టీజర్ అప్ డేట్ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ దసరాకి టీజర్ రిలీజ్ అవ్వాలి..  కానీ కొన్ని కారణాల వల్ల టీజర్ ను దీపావళికి పోస్ట్ పోన్ చేసారు. అవును దీపావళి స్పెషల్ గా నవంబర్ 14న #VakeelSaabTeaser రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని త్వరలోనే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం చతుర్మాస్య దీక్ష లో ఉన్న పవన్ కళ్యాణ్ దీక్ష అనంతరం సినిమాకి సంబందించిన బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేస్తాడు.

ఇక రిలీజ్ విషయానికొస్తే, ప్రస్తుతానికి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రానుంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు.