Vakeel Saab Shooting Updates

Friday,October 30,2020 - 01:57 by Z_CLU

Power Star Pawan Kalyan కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న 'Vakeel Saab' సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికొచ్చింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ మొదటి వారం నుండి మొదలు పెట్టనున్నారు. బ్యాలెన్స్ షూట్ ను తక్కువ రోజుల షెడ్యుల్ తో పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు .

తాజాగా చాతుర్మాస్య దీక్ష ముగించుకున్న Pawan Kalyan వచ్చే వారం నుండి ఈ సినిమా లో పాల్గొని టోటల్ షూట్ ని కంప్లీట్ చేయనున్నాడు. ఇంతవరకూ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అయితే దీపావళికి టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించనున్నారని తెలుస్తుంది.

Boney Kapoor సమర్పణలో Dil Raju , Sirish లు నిర్మిస్తున్న ఈ సినిమాకు Venu Sriram దర్శకుడు. Thaman ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అంజలి, నివేత థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చిన్న పాత్రలో కనిపించనుంది.

Also Check - వకీల్ సాబ్ Vs కేజీఎఫ్

పవన్ కొత్త సినిమా సంగతులు