Vakeel Saab on sets

Wednesday,September 23,2020 - 04:18 by Z_CLU

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అలా 6 నెలలుగా సెట్స్ కు దూరమైన ఈ సినిమా తాజాగా మళ్లీ మొదలైంది.

VakeelSaab సెట్స్ పైకొచ్చింది. హైదరాబాద్ లో ఈ మూవీ షూట్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ లో అంజలితో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.

Pawan Kalyan మాత్రం వచ్చే నెలలో షూటింగులో జాయిన్ అవుతారు. శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా అప్పుడే షూటింగులో పాల్గొంటారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.