Vakeel saab – All set for Grand pre release event

Sunday,April 04,2021 - 01:52 by Z_CLU

వకీల్ సాబ్ హంగామా మొదలైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం 6.30 నుంచి ఈ పండగ ప్రారంభం అవుతుంది. జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. http://www.zeecinemalu.com/ లో కూడా వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను చూడొచ్చు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీగా వస్తోంది వకీల్ సాబ్. పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే Vakeel saab Trailer సూపర్ హిట్టయింది. సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాసింది.

vakeel saab pawan kalyan

ఇప్పుడు అదే అంచనాల్ని డబుల్ చేస్తూ.. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా జరగనున్న ఈ ఈవెంట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేత థామస్ కీలక పాత్రల్లో నటించారు. వేణుశ్రీరామ్ డైరక్ట్ చేయగా.. తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.