Vakeel Saab – A blockbuster before Release

Thursday,April 08,2021 - 02:43 by Z_CLU

విడుదలకు ముందే వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను ఆల్రెడీ చూసిన కొంతమంది సినిమా సూపర్ గా ఉందంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా దుబాయ్, సింగపూర్ రిపోర్ట్ కాస్త ముందుగానే వచ్చింది.

ఈ సినిమా సెన్సార్ కాపీని చూసిన దుబాయ్ అఫీషియల్స్.. మూవీపై అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. పింక్ సినిమాతో వకీల్ సాబ్ ను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. స్టోరీలైన్ లో తప్ప, పింక్ సినిమాకు వకీల్ సాబ్ కు అస్సలు సంబంధం లేదంటున్నారు. పవన్ కోసం చేసిన మార్పులు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు.

అటు సింగపూర్ సెన్సార్ అఫీషియర్స్ కూడా దాదాపు ఇదే విధంగా రెస్పాండ్ అయ్యారు. పవన్ రీఎంట్రీకి ఇది పెర్ ఫెక్ట్ మూవీ అంటూనే.. రీమేక్ వెర్షన్ లో ఇదే బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

ఈరోజు రాత్రికే వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ నుంచి కామన్ ఆడియన్స్ టాక్ బయటకొస్తుంది. ఇక రేపు ఉదయం 6-7 గంటలకు ఏపీ,నైజాం ఆడియన్స్ నుంచి కూడా మూవీ టాక్ బయటకొచ్చేస్తుంది. అంతేకాదు.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతనే విషయంపై కూడా రేపు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కరోనా/లాక్ డౌన్ తర్వాత ఈ స్థాయిలో రిలీజైన తెలుగు సినిమా ఇదే. సౌత్ లో చూసుకుంటే విజయ్ నటించిన మాస్టర్ తర్వాత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న రెండో సౌత్ సినిమా ఇదే.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics