Vaishnav Tej in a sports drama

Monday,May 17,2021 - 12:32 by Z_CLU

ప్రస్తుతం 'జెర్సీ' సక్సెస్ తర్వాత మళ్ళీ తెలుగులో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఈ కోవలోనే మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. అవును.. పృథ్వి అనే కొత్త దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు వైష్ణవ్. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కనుందని , వైష్ణవ్ ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా కోసం హాకీ ట్రైనింగ్ తీసుకునే పనిలో ఉన్నాడట వైష్ణవ్. రెండు మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడట. వైష్ణవ్ కి హైదరాబాద్ లో ఉన్న సీనియర్ హాకీ ప్లేయర్ ట్రైనింగ్ ఇస్తున్నాడని సమాచారం. అయితే ఇది పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఉందని జస్ట్ హాకీ అనేది సినిమాలో ఒక ఎలిమెంట్ గా ఉంటుందని టాక్. ఇటివలే హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. సందీప్ తర్వాత తెలుగులో హాకీ నేపథ్యంలో వైష్ణవ్ చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఉప్పెన సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో ఇప్పటికే రెండో సినిమా పూర్తి చేసిన వైష్ణవ్ ఇద్దరు డెబ్యూ డైరెక్టర్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ హీరో అవ్వనున్నాడు. ఇప్పటికే వైష్ణవ్ ముందు పెద్ద లైనప్ ఉందని సమాచారం.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics