Vaishnav Tej Impressed with ‘Rangaranga Vaibhavamga’ Teaser

Monday,June 27,2022 - 01:04 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజైంది. బోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేశారు.

నిమిషం 23 సెకన్ల తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తూ ఆకట్టుకుంది. టీజర్ చూస్తే చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మంచి లవ్ స్టోరీ రాబోతుందని అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్  దర్శకుడు చాలానే ప్లాన్ చేశాడని టీజర్ లో కొన్ని సీన్స్ చూస్తే తెలుస్తుంది. సినిమాలో మాస్ కోరుకునే ఫైట్స్ కూడా ఉన్నాయని టీజర్ లో కొన్ని గ్లిమ్స్ తో చూపించారు.

ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఇగోతో పైకి మాట్లాడుకోకుండా ఉండే లవ్ స్టోరీతో సినిమా తెరకెక్కిందని టీజర్ తో క్లియర్ గా చెప్పారు. వైష్ణవ్ తేజ్ డోరు బయట ఉండి కేతిక అందాలు చూసే సీన్ , అలాగే కేతిక చెప్పే డైలాగ్స్ , విజువల్స్ , దేవి స్కోర్ కలిసి కలిసి టీజర్ ని హిట్ చేశాయి. టీజర్ చివర్లో  తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి.

ఇప్పటి వరకూ సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసి బజ్ క్రియేట్ చేసిన 'రంగ రంగ వైభవంగా' సినిమా తాజాగా రిలీజైన టీజర్ తో మరిన్ని అంచనాలు పెంచేసింది. ఓవరాల్ గా పర్ఫెక్ట్ టీజర్ కట్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics