‘Uppena’ Producers gifted big amount to Vaishnav Tej , Krithi Shetty !

Friday,February 26,2021 - 03:02 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కృతిశెట్టి లతో పాటు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమైన 'ఉప్పెన' సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్ళు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర స్టామినా చాటుతుంది. తాజాగా ఈ సక్సెస్ లో మేజర్ రోల్ పోషించిన హీరో -హీరోయిన్ కి పెద్ద ఎమౌంట్ తో చెక్ లను గిఫ్ట్ గా ఇచ్చారు మైత్రి నిర్మాతలు.

షూట్ కి ముందే ఇద్దరికీ మంచి రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ సినిమా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి లకు భారీ ఎమౌంట్ ను బహుమతిగా అందించి నిర్మాతలుగా మంచి మనసు చాటుకున్నారు నవీన్ , రవి.

హీరో వైష్ణవ్ తేజ్ కి కోటి రూపాయిలు, అలాగే హీరోయిన్ కి యాబై లక్షలకు పైగా అందించారని సమాచారం. ఇదే నిజమైతే మొదటి సినిమాకే భారీ ఎమౌంట్ ను గిఫ్ట్ గా అందుకున్న రికార్డు వీరికే దక్కుతుంది. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్ తో వైష్ణవ్ తేజ్ మనం ఎంటర్టైన్మెంట్స్ బేనర్ లో నాగార్జున నిర్మాతగా కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు.  కృతి ఆల్రెడీ నాని ,సుదీర్ బాబు సినిమాల్లో నటిస్తుంది.