Upendra New movie “Kabja” First look launch

Friday,September 18,2020 - 11:41 by Z_CLU

ఉపేంద్ర నటించగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై, లాంకో శ్రీధర్ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం "కబ్జ". ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు.

టాలీవుడ్ జనాలకు ఉపేంద్ర గురించి ఇంట్రో అక్కర్లేదు. A, ఉపేంద్ర, రక్త కన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్ వంటి వైవిధ్యంగా ఉండే తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు ఈ స్టార్. సన్ ఆఫ్ సత్యమూర్తి తో 2015లో తెలుగు సినిమాను మళ్ళీ పలకరించగా, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా 'KABJA' తో మళ్ళీ కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో పలకరించబోతున్నాడు Upendra.

తెలుగులో సుధీర్ బాబు తో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, 'కె.జి.ఎఫ్' సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు అందించబోతున్నాడు.