Trivikram Launched Sreekaram Title song

Saturday,February 27,2021 - 01:21 by Z_CLU

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం "శ్రీకారం". ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యువ సంగీత కెరటం మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు..

ఈ సినిమా టీజర్ ను మహేష్ బాబు లాంచ్ చేయగా.. ఇప్పుడు టైటిల్ సాంగ్ ను త్రివిక్రమ్ లాంచ్ చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, చిత్ర దర్శకుడు కిషోర్ బి, నటుడు సప్తగిరి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు..

ఫుల్ సాంగ్ కోసం క్లిక్ చేయండి

విలేజ్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమాలో శర్వా సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.