Trivikram Birthday Special

Saturday,November 07,2020 - 12:11 by Z_CLU

త్రివిక్రమ్.. టాలీవుడ్ లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఇది పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్. అవును.. త్రివిక్రమ్ సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి సినిమాలకు హీరోయిజంతో పనిలేదు. భారీతనంతో అస్సలు పనిలేదు. మాటల మాంత్రికుడి డైలాగ్స్ ఉంటే చాలు ఆడియన్స్ పండగ చేసుకుంటారు.

ఈ మాటల మాంత్రికుడు ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ మొత్తం ఈ టాలెంటెడ్ డైరక్టర్ కు శుభాకాంక్షలు అందిస్తోంది.

మాటలతో తెలుగు సినిమాను మలుపుతిప్పిన అతికొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. త్రివిక్రమ్ సినిమాలకు ఓ స్థాయి ఉంటుంది. అతడి మాటలకు అంతకంటే పెద్ద స్థాయి ఉంటుంది. చాంతాడంత డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పే హీరోలకు... చిన్నచిన్న పదాలతో, కుదురైన వాక్యాలతో డైలాగులు ఇచ్చాడు. తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చేశాడు.

త్రివిక్రమ్ మాటలు నవ్విస్తాయి. సేమ్ టైం ఏడిపిస్తాయి. ఇంకొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. ఎలాంటి ఫీలింగ్స్ ఇచ్చినప్పటికీ.. అన్నింటినీ కలకాలం గుర్తుంచుకోవాలి అనిపించేలా చేస్తాయి ఆ మాటలు. కథా రచయిత, మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్.. ఆ స్టేజ్ లోనే అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. తనలో అంతకుమించి టాలెంట్ ఉందని నలుగురికి తెలిసేలా చేసుకున్నారు. అలా నువ్వే-నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ కు.. అప్పట్నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

త్రివిక్రమ్ సినిమాల్లో కథ, డైలాగ్స్, మంచి పాటలతో పాటు హీరోయిజం కూడా ఉంటుంది. అదే ఇతడి సినిమాల్లో గొప్పదనం. అప్పటివరకు హీరోకు ఉన్న ఇమేజ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసి చూపించడం త్రివిక్రమ్ కు ఇష్టం. అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది.. ఇలా త్రివిక్రమ్ తీసిన ప్రతి సినిమాలో ఓ మేజిక్ కనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=kFUz6q3MRdQ

'అత్తారింటికి దారేది' లాంటి సున్నితమైన కథలతో కూడా ఆల్ టైం రికార్డులు సృష్టించవచ్చని చూపించిన త్రివిక్రమ్.. 'అ..ఆ' సినిమాతో తెలుగు పరిశ్రమకు మరింత తెలుగుదనాన్ని ఆపాదించారు.

ఇక అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసిన  'అలా వైకుంఠపురములో' సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్రివిక్రమ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు.. ఇండస్ట్రీలోని ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది 'జీ సినిమాలు'.