Top-10 reasons to watch RRR Movie

Wednesday,March 23,2022 - 04:46 by Z_CLU

Top-10 reasons to watch RRR Movie

రాజమౌళి సినిమా చూడటానికి చాలానే రీజన్స్ ఉంటాయి. వాటితో రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయడంలో ఆయన దిట్ట కూడా. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తీసిన RRR భారీ అంచనాల నడుమ మార్చ్ 25న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా చూడ్డానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి వాటిలో టాప్ 10 రీజన్స్ ఏంటో చూద్దాం.

రీజన్ 1 - రాజమౌళి సినిమా

RRR సినిమా చూడటానికి మొదటి రీజన్ రాజమౌళి. అవును రాజమౌళి సినిమా అనే బ్రాండే ఆడియన్స్ ని ముందుగా ఎగ్జైట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆయన డైరెక్షన్ లో చేసిన స్టార్ హీరోలు కూడా ఒప్పుకుంటారు. 'బాహుబాలి' ఫ్రాంచైజీ తో వరల్డ్ వైడ్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో RRR వైపు ప్రపంచమంతా చూస్తోంది. అందుకే RRR మొదటి రీజన్ ఎస్ ఎస్ రాజమౌళి అనే స్టాంప్.

RRR-ramcharan-ntr1

రీజన్ 2 - బిగ్గెస్ట్ మల్టీస్టారర్

టాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేసే క్రేజీ మల్టీ స్టారర్ సినిమా వచ్చి చాన్నాళ్ళయింది. ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో - మరో సీనియర్ హీరో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాలు  వచ్చాయి. కానీ స్టార్డంతో ఈక్వల్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు  కలిసి సినిమా చేయడం RRR చూడ్డానికి బెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. అవును ఎన్టీఆర్ , రామ్ చరణ్ లను స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర  ఎగబడుతున్నారు. ఈ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రాబోతున్న RRR సినిమాలో ఈ ఇద్దరినీ చూడ్డానికి ఎంత టికెట్ అయినా ఫరవాలేదు అన్నట్టుగా డిమాండ్ ఉంది.

NTR RRR zeecinemalu

రీజన్ 3 : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి మూడేళ్ళవుతోంది. 'అరవింద సమేత' తర్వాత వెంటనే RRR సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు తారక్. దీంతో మూడేళ్ళ నుండి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా తారక్ ని స్క్రీన్ పై చూడాటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్ స్పెషల్ గా ఎట్రాక్ట్ గా నిలిచాయి. కొమురం భీమ్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాకు స్పెషల్ రీజన్.

RRR ramcharan (1)

రీజన్ 4 - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా  RRR కి మరో స్పెషల్ రీజన్. చరణ్ ని స్క్రీన్ పై చూసి కూడా దాదాపు మూడేళ్ళవుతోంది. దీంతో చరణ్ సినిమా చూసేందుకు మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అల్లూరి సీతారామరాజుగా  నటించిన రామ్ చరణ్ సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా కనిపించనున్నాడో ట్రైలర్ లో చూపించారు. బ్రిటీష్ సామ్రాజ్యంలో పోలీస్ గా పనిచేసే రామరాజు క్యారెక్టర్ లో మెరవబోతున్నాడు చరణ్.

RRR-Third-single-on-nov-25th-RamCharan-Ntr-zeecinemalu

రీజన్ 5 - అద్భుతమైన స్టోరీ లైన్

RRR చూసేందుకు మరో రీజన్ స్టోరీ లైన్.  అల్లూరి సీతారామరాజు , కొమురం భీమ్ ఇద్దరూ నాలుగేళ్ళు ఎవరికీ కనిపించకుండా  ఎక్కడున్నారో తెలియకుండా గడిపారు. ఈ ఎలిమెంట్ తీసుకొని రాజమౌళి తన తండ్రితో కలిసి ఓ కల్పిత కథ రెడీ చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు -కొమురం భీమ్ కథతో తెరకెక్కిన స్టోరీ లైన్ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. అసలు ఈ కల్పిత కథతో  జక్కన్న ఏం చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ నెలకొంటుంది.

RRR movie stills NTR ramcharanRRR movie stills NTR ramcharan

రీజన్ 6 - అలియా భట్, అజయ్ దేవగన్

సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అలియా భట్ , అజయ్ దేవగన్.  ఎన్నో గొప్ప గొప్ప పాత్రలతో ఆకట్టుకున్న అలియా భట్ RRR లో సీతగా కనిపించనుంది.  ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ అనిపించుకున్న  అలియా సీతగా మెస్మరైజ్ చేస్తుందని ఇప్పటికే యూనిట్ గట్టిగా చెప్తున్నారు. ఇక సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో బిజీ హీరోగా ఉన్న అజయ్ దేవగన్ ఈ స్పెషల్ రోల్ చేయడం కూడా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

రీజన్ 7 - ప్రొడక్షన్ వాల్యూస్ 

భారీ కాస్టింగ్ తో తెరకెక్కే భారీ సినిమాకి ప్రొడక్షన్ వేల్యూస్ తో క్వాలిటీ చూపించడం చాలా ముఖ్యం. ఈ సినిమాకోసం ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా ఎన్నో భారీ సెట్స్ వేశారు.  అధిక ఖర్చు తో విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు. ఈ సినిమాను తమ బేనర్ లో ఓ ప్రతిష్టాత్మక సినిమాగా రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ పెట్టి రాజమౌళి అడిగిందళ్ళా అందించాడు నిర్మాత దానయ్య. ఈ సినిమాకి సుమారు ౩౦౦ కోట్ల పైనే ఖర్చు పెట్టారంటే ప్రొడక్షన్ వేల్యూస్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

#RRRMassAnthem-OUT-Rajamouli-NTR-Ramcharan-ZEECINEMALU-news

రీజన్ 8 - మ్యూజిక్

RRR కి  బిగ్గెస్ట్ ఎస్సెట్ మ్యూజిక్. అవును కీరవాణి అందించిన సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఇప్పటికే "నాటు నాటు" సాంగ్ వైరల్ అయింది. మిగతా సాంగ్స్ కూడా క్లిక్ అయ్యాయి. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని టీం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

RRR ramcharan NTR zeecinemalu

రీజన్ 9 - సినిమాటోగ్రఫీ -ఆర్ట్ 

రాజమౌళి సినిమా అంటే గ్రాండియర్ విజువల్స్ తో పాటు మైమరిపింపజేసే ఆర్ట్ వర్క్ పక్కా ఉంటుంది. RRR లో ఆ విభాగాల్లో బెస్ట్ వర్క్ ఉండనుంది. సెంథిల్ సినిమాటోగ్రఫీ తో పాటు సబు సిరియల్ ఆర్ట్ వర్క్ సినిమాకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ అందించాయని తెలుస్తుంది. టీజర్ , ట్రైలర్స్ లో వీరి వర్క్ గురించి ఆల్రెడీ డిస్కషన్ జరగడంతో  ఇప్పుడు సినిమా చూడాటానికి గ్రాండియర్ విజువల్స్ , భారీ సెట్స్ కూడా రీజన్స్ గా నిలిచాయి.

RRR-Glimpse-ntr-ramcharan-rajamouli-aliabhatt-ajaydevagn-news-zeecinemalu

రీజన్ 10 - యాక్షన్ బ్లాక్స్

సినిమాలో రాజమౌళి మార్క్ యాక్షన్ బ్లాక్స్ మెస్మరైజ్ చేస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరూ కలిసి చేసే ఫైట్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ట్రైలర్ లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కి సంబంధించి విజువల్స్ వేసి ఎట్రాక్ట్ చేసిన జక్కన్న థియేటర్స్ మాస్ , క్లాస్ తేడా లేకుండా యాక్షన్ తో మెప్పించడానికి రెడీ అయ్యాడు. సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అంటున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చూసేందుకు ఇన్ని రీజన్స్ ఉన్నాయి. వీటిన్నిటి కోసం టికెట్టు కొని సినిమా ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics