Tollywood Shooting Updates

Wednesday,November 25,2020 - 11:14 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా సెట్స్ పైకి వచ్చాయి. మరి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాల అప్ డేట్స్ మీ కోసం.

మెగాస్టార్ Chiranjeevi లేటెస్ట్ మూవీ 'Acharya' షూటింగ్ కోకాపేట్ లోని భారీ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం సోనూ సూద్ , తణికెళ్ళ భరణి మిగతా నటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. అతి త్వరలోనే చిరంజీవి షూటింగ్ జాయిన్ కానున్నారు. ఆ తర్వాత చిరుపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారు. వచ్చే నెల నుండి రామ్ చరణ్ కూడా షూటింగ్ పాల్గొంటాడని సమాచారం. Matinee Entertainments , Konidela Productions బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Prabhas'RadheShyam' చివరి షెడ్యుల్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రభాస్ మిగతా నటులపై క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ పూర్తి చేసి సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. Uv Creations & T Series నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న VakeelSaab సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రెజెంట్ పవర్ స్టార్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యుల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్నారు.

Kangana Raut టైటిల్ రోల్ లో నటిస్తున్న 'Thalaivi' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. Vibri Media Karma Media ,Entertainment నిర్మిస్తున్న ఈ సినిమాకు AL Vijay దర్శకత్వం వహిస్తున్నాడు.

Gopichand Seetimaar మళ్ళీ మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్లో నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో గోపీచంద్ మిగతా నటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

నితిన్ 'Rang De'సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. Nithin,Keerthy Sureshల మీద సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్. Sithara Entertainments బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.