Tollywood shooting updates

Thursday,November 19,2020 - 10:01 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్స్ తో పాటు కొత్త సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ముందుకు సాగుతున్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఆ సినిమాల వివరాలు మీ కోసం.

LoveStory

ShekarKammula దర్శకత్వంలో Naga Chaitanya, Sai Pallavi జంటగా నటిస్తున్న Love Story షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి మిగిలిన సన్నివేశాలను షూట్ చేసిన యూనిట్ ఎట్టకేలకు టోటల్ షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

KothiKommachi

జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు Vegesna Satish దర్శకత్వంలో మేఘమ్ష్, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న Kothi Kommachi షూటింగ్ అమలాపురంలో జరుగుతుంది. ప్రస్తుతం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను Nandini Rai, Meghamsh, Sameer లపై షూట్ చేస్తున్నారు. అమలాపురంలో షూటింగ్ పూర్తి చేసి యూనిట్ విశాఖపట్నం వెళ్లనున్నారు. సింగిల్ షెడ్యుల్ లో ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ ఫినిష్ చేయబోతున్నారు. Lakshya Productions బ్యానర్ పై MLV సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు Anup Rubens సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా థియేటర్స్ లోకి రానుంది.

Gaali Sampath

Anil Ravipudi సమర్పణలో Shree Vishnu హీరోగా తెరకెక్కుతున్న Gaali Sampath షూటింగ్ ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హైదరాబాద్ లో హీరో శ్రీ విష్ణు , రాజేంద్ర ప్రసాద్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. అనిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాను S Krishna నిర్మిస్తున్నాడు. తండ్రి కొడుకుల కథతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు AchuRajamaniసంగీతం అందిస్తున్నాడు.

RajTarun New Movie

Annapurna Studios బ్యానర్ పై Nagarjuna నిర్మాణంలో Raj Tarun హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా.

A1 Express 

Sundeep Kishan A1 Express షూటింగ్ పూర్తయింది. Dennis Jeevan Kanukolanu దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగ్ ను పంజాబ్ పూర్తి చేసారు. సందీప్ కిషన్ సరసన Lavanya Tripati హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jambie Reddy

Jambie నేపథ్యంలో దర్శకుడు Prashanth Varma తెరకెక్కిస్తున్న Jambie Reddy సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. Teja Sajja, Anandi, Daksha ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను Apple Tree బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు.