Tollywood Shooting Updates

Thursday,September 17,2020 - 03:25 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమాలు మళ్ళీ జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటున్నాయి. కరోనా సోకకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

Vaishnav Tej, Rakul తో దర్శకుడు Krish jagarlamudi తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అటవీ ప్రాంతలో జరుగుతుంది. వైష్ణవ్ తేజ్, రకుల్, కోటా శ్రీనివాసరావు, అన్నపూర్ణమ్మ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. 30 రోజుల షెడ్యుల్ తర్వాత యూనిట్ నల్లమల ఫారెస్ట్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ 10 రోజులు షూట్ చేసి సినిమా పూర్తిచేయబోతున్నారు.

Akhil AKkineni, Bommarillu Bhaskar కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'Most Eligible Bachelor' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వివిధ ప్రదేశాల్లో జరుగుతుంది. ప్రస్తుతం అఖిల్, పూజా హెగ్డే లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఫైనల్ షెడ్యుల్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతి కి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Allu Aravind సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

Naga Shaurya కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం అజీజ్ నగర్ లో జరుగుతుంది. గతంలో Sarileru Neekevvaru కోసం వేసిన ప్రత్యేక సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. Santosh Jagarlapudi డైరెక్షన్ లో ఆర్చెరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మాతలు.

సంతోష్ శోభన్ హీరోగా UV Creations తో కలిసి Merlapaka Gandhi నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. మేర్లపాక గాంధి కథ, స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దర్శకుడు. తక్కువ సమయంలోనే షూట్ ఫినిష్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

[caption id="attachment_176506" align="alignnone" width="341"] naandi-movie-stills-zeecinemalu[/caption]

Allari Naresh హీరోగా నటిస్తున్న 'Nandi' షూట్ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో అల్లరి నరేష్ నరేష్ మిగతా నటులపై సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యుల్ తో టోటల్ షూట్ పూర్తవుతుంది. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో సస్పెన్స్ క్రైం డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సతీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే షూట్ ఫినిష్ చేసి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు.

నిర్మాత Raj Kandukuri తనయుడు Shiva Kandukuri హీరోగా Megha Akash హీరోయిన్ గా నటిస్తున్న 'ManuCharitra' మేడ్చల్ షెడ్యుల్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఫిలిం నగర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హీరో మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ సమర్పణలో శ్రీనివాస్ , రోనీ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ఫైనల్ షెడ్యూల్ కూడా మొదలైంది. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. తర్వాత గండికోటలో మరికొన్ని సీన్స్ తీశారు. ఈ నెలాఖరుకు సినిమా షూట్ కంప్లీట్ అవుతుంది.