Tollywood Shooting Update

Wednesday,February 03,2021 - 03:08 by Z_CLU

లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమాలతో పాటు కొత్త సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చకచకా రెడీ అవుతున్నాయి.  ఏ స్టార్ ఏ షూటింగ్ లో ఉన్నాడు ? ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది ? ఆ డీటైల్స్ మీ కోసం.

Acharya chiranjeevi

కొరటాల శివ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కోకాపేట్ టెంపుల్ టౌన్ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం చిరు , చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు యూనిట్. మార్చ్ కల్లా టోటల్ షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. మే 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

SALAAR_PRABHAS

ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్ గోదావరిఖనిలో షెడ్యుల్ పూర్తి చేసుకుంది.  ఒసీపీ 2 పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ప్రశాంత్ నీల్ -ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

RRR-release-October-13-ramcharan-ntr

'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ప్రస్తుతం తారక్ , చరణ్ లతో పాటు హీరోయిన్ల పై కీలక సన్నివేశాలు తీస్తున్నాడు రాజమౌళి. మరో రెండు మూడు నెలల్లో టోటల్ షూట్ కంప్లీట్ చేసి అక్టోబర్ 13న దసరా కానుకగా సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

pawan rana movie 1st day shoot

పవన్ కళ్యాణ్ -రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం పవన్ -రానా లపై సన్నివేశాలు తీస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న  ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే -మాటలు అందిస్తున్నాడు.

Pushpa-release-on-dussehra-2021-news

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా షూటింగ్  తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -రష్మిక లపై సన్నివేశాలతో పాటు సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యుల్ ఫినిష్ చేసి హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

Venkatesh_Narappa_first_glimpse

వెంకటేష్ హీరోగా తమిళ్ 'అసురన్' కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'నారప్ప' షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో  వేసిన సెట్ లో క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేసారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 14న థియేటర్స్ లోకి రానుంది.

బోయపాటి శ్రీను -బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న 'BB3' తాజాగా మరో షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారం నుండి ఇంకో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఇప్పటికే ఆ షెడ్యుల్ కోసం భారీ సెట్ రెడీ చేసారు. అందులో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

RaviTeja-Khiladi-May-28-release-zeecinemalu

'క్రాక్' తో థియేటర్స్ సందడి చేస్తోన్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. మే 28న సినిమా థియేటర్స్ లోకి రానుంది.

Republic_release-date-locked

సాయి ధరమ్ తేజ్ -దేవకట్టా కాంబినేషన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా  వస్తున్న 'రిపబ్లిక్' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం సిటీలోని కొన్ని ప్రదేశాల్లో క్రైం సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థతో కలిసి జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్ , పుల్లారావు నిర్మిస్తున్నారు.

Naga Shaurya Ritu Verma Varudu Kaavalenu వరుడు కావలెను

'వరుడు కావలెను' షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ప్రస్తుతం నాగ శౌర్య - రీతు వర్మ లపై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.