Tollywood Producers Looking for OTT Offers

Friday,June 11,2021 - 05:08 by Z_CLU

కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అవ్వడం ప్రేక్షకులు రావడం జరగని పని. అందుకే కొందరు నిర్మాతలు OTT వైపు మొగ్గు చూపుతున్నారు. రెడీగా ఉన్న సినిమాలను డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆగస్ట్ వరకు ఇదే పరిస్థితి ఉంటే మినిమం బడ్జెట్ సినిమాలన్నీ OTT ముందు క్యూ కట్టడం ఖాయం.

most eligible bachelor

తాజాగా ఈ విషయంపై నిర్మాత బన్నీ వాస్ కూడా మాట్లాడారు. తమ బేనర్ లో నిర్మించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్',18 పేజెస్ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేదా OTT లో రిలీజ్ చేయాలా ? అని ఆలోచిస్తున్నామని ఆగస్ట్ , సెప్టెంబర్ లో వాటి రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ఇక బడా సినిమాలు ఇప్పుడప్పుడే విడుదలయ్యే పరిస్థితి లేదని. ఒక వేళ చేసినా కోట్ల కలెక్షన్స్ కష్టమే అని భారీ కలెక్షన్స్ రావాలంటే మన దగ్గర ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మొదలు పెట్టాలని, ముఖ్యంగా ఓవర్ సీస్ మార్కెట్ ఓపెన్ అవ్వాలని అన్నాడు బన్నీ వాస్.

ఏదేమైనా థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చు. ఈ లోపు అందరు వ్యాక్సిన్ వేయించుకుంటే దైర్యంగా సినిమాలు చూసేందుకు థియేటర్స్ కి వస్తారు. అప్పటి వరకు చిన్న నిర్మాతలకు OTT నే ప్రత్యామ్నయంగా కనిపిస్తుంది. జులై తర్వాత మరిన్ని సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics