Tollywood Donations for Hyderabad Flood Relief

Wednesday,October 21,2020 - 01:19 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వరదలు వచ్చినా తమ వంతు సహాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు సినీ ప్రముఖులు. చాలా ఏళ్ల క్రితం దివిసీమలో వరద బాధితులకు NTR, ANR విరాళం ప్రకటించారు. అక్కడ్నుండి ఎప్పుడు వరదలు వచ్చిన ఇండస్ట్రీ ముందుండటం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం తమ వంతుగా Telangana CM Relief Fund కి భారీ విరాళాలు ప్రకటించారు సినీ ప్రముఖులు.

మెగాస్టార్ Chiranjeevi తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించగా Prabhas కోటి 50 లక్షలు , Pawan Kalyan కోటి, Mahesh కోటి, NTR 50లక్షలు, Nagarjuna 50లక్షలు, Ram Pothineni 50 లక్షలు, Raviteja 10లక్షలు, Vijay Deverakonda 10 లక్షలు, Trivikram Srinivas 10 లక్షలు, Anil Ravipudi 5 లక్షలు , Harish shankar 5 లక్షలు, నిర్మాత RadhaKrishna 10 లక్షలు, Mythri Movie 10 లక్షలు , దర్శకుడు Trinath (Mekasuri) 50 లక్షలు ప్రకటించారు.

ఇక తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇలా స్టార్స్ విరాళాలు ప్రకటించడంపై తెలంగాణా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.