Tollywood Directors with Kollywood stars

Thursday,June 24,2021 - 01:43 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ -వంశీ పైడిపల్లి సినిమా కాగా మరొకటి ధనుష్ -శేఖర్ కమ్ముల సినిమా. అవును ఈ రెండు సినిమాలపై ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టి చర్చే నడుస్తుంది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల తమిళ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు మొదలయ్యాయి.

[caption id="attachment_190037" align="alignnone" width="586"]vamsi paidipally vijay movie zeecinemalu దర్శకుడు వంశీ పైడిపల్లి హీరో విజయ్[/caption]

నిజానికి విజయ్ -వంశీ పైడిపల్లి కాంబో ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. కానీ ధనుష్ -శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ మాత్రం అందరికీ సప్రయిజ్. అవును ఈ కాంబోలో ఒక సినిమా రానుందని ఎక్కడా న్యూస్ కానీ ప్రచారం కానీ జరగలేదు. డిస్కషన్ స్టేజిలో కూడా మేకర్స్ నుండి హింట్ రాలేదంటే ఈ ప్రాజెక్ట్ ఎంత సీక్రెట్ గా సెట్ అయిందో అర్థమైవుతుంది. లవ్ స్టోరి షూటింగ్ పూర్తవ్వగానే తను రాసుకున్న కథతో ధనుష్ ని సంప్రదించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా డిస్కషన్స్ కోసం పలు సార్లు చెన్నై వెళ్ళాడు కమ్ముల. అలాగే కొన్ని స్క్రిప్ట్ డిస్కషన్స్ ఆన్లైన్ ద్వారా జరిపారు.

[caption id="attachment_191310" align="alignnone" width="568"]dhanush-sekhar-kammula శేఖర్ కమ్ముల - ధనుష్[/caption]

ఏదేమైనా మన తెలుగు దర్శకులను తమ నెక్స్ట్ సినిమాలకు ఎంచుకొని టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నారు విజయ్ , ధనుష్. ఇక తెలుగులో ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉండటంతో వంశీ పైడిపల్లి, శేఖర్ ఇద్దరూ తమ పాన్ ఇండియా సినిమాలను వాళ్ళతో సెట్ చేసుకొని వీళ్ళు కూడా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి విజయ్ , ధనుష్ ఈ సినిమాలతో తెలుగులో ఎలాంటి విజయం అందుకుంటారో ? తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారా ? చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics