This Dasara has Teasers special

Thursday,September 24,2020 - 01:52 by Z_CLU

పండగ సీజన్స్ లో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారన్న విషయం తెలిసిందే. అందుకే సంక్రాంతి, దసరా సీజన్స్ కి సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈసారి దసరాకి సినిమాలు రిలీజ్ కాలేకపోతున్నాయి. సినిమాలు రిలీజ్ లేకపోతేనేం అంటూ టీజర్స్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు.

అవును.. బాలకృష్ణ నుండి అఖిల్ వరకూ ఈ దసరాకి ఓ ఐదారు టీజర్లు విడుదల కాబోతున్నాయి. RRR నుండి NTR వర్షన్ టీజర్ ను కూడా విజయదశమికి ప్లాన్ చేస్తున్నారు. ఇక Balayya, Boyapati కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా నుండి దసరాకి మరో టీజర్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి.

అలాగే రవితేజ Krack ట్రైలర్ తో పాటు అఖిల్ Most eligible bachelor టీజర్ కూడా అక్టోబర్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్స్ కూడా దసరాకి సందడి చేయనున్నాయని టాక్.