Thaman’s ‘VakeelSaab’ Juke Box Review

Wednesday,April 07,2021 - 02:05 by Z_CLU

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ 'వకీల్ సాబ్' సినిమా ఒప్పుకున్నప్పుడు సినిమాలో పాటలు లేవు. కేవలం నేపథ్య సంగీతం అందించడానికి మాత్రమే స్కోప్ ఉంది. అయితే దర్శకుడు శ్రీ రామ్ వేణు కథలో చేసిన మార్పులతో తమన్ కి బెస్ట్ సాంగ్స్ కంపోజ్ చేసే ఛాన్స్ దొరికింది. దాంతో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మొదటి సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ అందించాడు. రిలీజ్ కి ముందే సినిమాపై అంచనాలు పెంచేసిన 'వకీల్ సాబ్' సూపర్ హిట్ సాంగ్స్ పై 'జీ సినిమాలు' జ్యూక్ బాక్స్ రివ్యూ.

మగువా మగువా :

'పింక్' కి రీమేక్ గా తెరకెక్కిన 'వకీల్ సాబ్' లో తప్పకుండా ఉండాల్సిన పాట "మగువా మగువా". ఆడాళ్ళ పై జరిగే హత్యాచారాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో మహిళల గొప్పదనం చాటి చెప్పేలా ఒక సాంగ్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే  తక్కువ టైంలో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉమెన్స్ కి డెడికేట్ చేసేలా అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశాడు థమన్. ఆ ట్యూన్ కి అద్భుతమైన సాహిత్యం అందించి తన వంతు కృషి చేశారు రామజోగయ్య శాస్త్రి. తమన్ ట్యూన్ కి  రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కి తన గొంతుతో మరింత అందం తీసుకొచ్చి ఈ సాంగ్ జనాల్లోకి దూసుకెళ్ళేలా చేశాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పదాలతో మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్తూ వారిపై గౌరవం పెంచేలా చేశారు.  ఇక అందరి కృషి ఫలించి 'మగువా మగువా' మోస్ట్ పాపులర్ సాంగ్ లో చేరి ఉమెన్ కి బెస్ట్ ఆంతెమ్ గా మారింది. సినిమాలో ఓ సందర్భంలో వచ్చే ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని  చెప్తున్నారు యూనిట్.

సత్యమేవ జయతే :

'వకీల్ సాబ్' క్యారెక్టర్ ని మరింత ఎలివేట్ చేస్తూ ఎమోషన్ చూపిస్తూ కథకి బలం చేకూర్చే సాంగ్ ఇది. పవర్ స్టార్ మీద ప్రేమతో అతని నిజ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని థమన్ కంపోజ్ చేసిన 'సత్యమేవ జయతే' విడుదలైన వెంటనే పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి అందించిన పవర్ ఫుల్ లిరిక్స్ సాంగ్ కి మరింత స్ట్రెంత్ ఇచ్చింది. శంకర్ మహదేవన్ సింగింగ్ ఈ పాటకు ప్రాణం పోసింది. పృథ్వి చంద్ర , తమన్ గానం కూడా సాంగ్ ని మరింత ఎలివేట్ చేసింది. అవన్నీ కలిసి 'సత్యమేవ జయతే' సూపర్ హిట్ సాంగ్ గా తీర్చిదిద్దాయి.

కంటి పాప :

సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ల లవ్ ట్రాక్ ఆడియన్స్ కి రీచ్ చేసే సాంగ్ ఇది. ఈ ఆల్బమ్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఓ సాంగ్ దొరకడంతో సాఫ్ట్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేసి 'కంటి పాప' అందించాడు థమన్. ఇక ఈ సాంగ్ కి కూడా రామజోగయ్య శాస్త్రి బెస్ట్ లిరిక్స్ అందించి సూపర్ హిట్ సాంగ్ లో భాగమయ్యారు. ముఖ్యంగా సాంగ్ మొదలైన కాసేపటికి వచ్చే 'మొదలేగా కొత్త కొత్త కథలు' అనే బీట్ మ్యూజిక్ లవర్స్ కి ఓ కిక్ ఇచ్చింది. అర్మాన్ మాలిక్ , దీపు పాడిన ఈ  సాంగ్ ఆల్బమ్ లో సూపర్ హిట్ లవ్ సాంగ్ అనిపించుకుంది.

కదులు కదులు :

జనంలో చైతన్యం తీసుకొచ్చే ఇంకో పాటకి కూడా స్పేస్ క్రియేట్ చేశాడు శ్రీ వేణు. ఇంకేముందు వెంటనే "కదులు కదులు" అంటూ ఓ విప్లమాత్మక పాటను అందించాడు థమన్. వకీల్ సాబ్ ఆల్బమ్ నుండి చివరి పాటగా విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకుంటూ అలరిస్తుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. శ్రీ కృష్ణ , హేమచంద్ర సింగింగ్ టాలెంట్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యింది. ఓవరాల్ గా ఈ సాంగ్ కూడా ఆల్బం లో మరో బెస్ట్ అనిపించుకుంది.

ఏదేమైనా పాటలకి స్కోప్ లేని కథలో దర్శకుడు చేసిన కొన్ని మార్పులు దృష్టిలో పెట్టుకొని నాలుగు పాటలు అందించి రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ చేసి మ్యూజిక్ లవర్స్ కి మరో బెస్ట్ ఆల్బమ్ అందించిన థమన్ ని మెచ్చుకోవాలి. ఫైనల్ గా  'వకీల్ సాబ్' ఆల్బమ్ లో నాలుగు రకాల డిఫరెంట్ పాటలు మిలియన్ వ్యూస్ సాక్షిగా సూపర్ హిట్ సాంగ్స్ లిస్టు లోకి చేరిపోయాయి.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics