Thalapathy Vijay’s ‘Vaarasudu’ First Look Out

Wednesday,June 22,2022 - 10:52 by Z_CLU

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న సినిమా కావడంతో 'వారసుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ టైటిల్ తో విజయ్  ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ లుక్ లో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.'' ది బాస్ రిటర్న్స్'' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నారు. భారీ అంచనాలువున్న ఈ కాంబినేషన్ పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని రెట్టింపు చేస్తోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు.  ఈ సినిమాతో  విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు.ఈ చిత్రానికి తమిళంలో 'వారిసు' టైటిల్ ని ఖరారు చేశారు. విజయ్ సరసన  రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics