Teja Sajja’s HanuMan Movie Teaser Review

Monday,November 21,2022 - 02:23 by Z_CLU

తేజ సజ్జ (Teja Sajja) హీరో గా నటిస్తున్న తాజా సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్టులు, కథలు డీల్ చేసే ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న మరో విజువల్ వండర్ హనుమాన్.

తాజాగా ఈ సినిమా టీజర్ (HanuMan Teaser) రిలీజైంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, హీరో ఇంట్రడక్షన్, సూపర్ పవర్స్.. ఇలా సెటప్ మొత్తం ఔట్ ఆఫ్ ది బాక్స్ టైపులో ఉంది.

సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. టీజర్ లో అతడి లుక్స్ అదిరిపోయాయి. గద పట్టుకొని హెలికాప్టర్ కు అడ్డంగా నిలబడిన విజువల్ హైలెట్. ఇక అమృత అయ్యర్ క్యూట్ గా కనిపించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ రోల్ పోషించినట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది.

ఇక టీజర్ చివర్లో ముంచులో హనుమాన్ రామనామాన్ని జపిస్తున్నట్టు చూపించి, మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌరి హరి, అనుదీప్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. హనుమాన్ ను వచ్చే ఏడాది పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics