Teja Sajja’s ‘Hanu-man’ Teaser launch postponed

Tuesday,November 15,2022 - 01:15 by Z_CLU

టాలీవుడ్ లో హను-మాన్ హంగామా మొదలైంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి టీజర్ తో ట్రీట్ ఇవ్వడానికి హను-మాన్ (Hanu-Man) టీం రెడీ అయింది. తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ ను ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేయాలని ఫిక్స్ చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ గారి అకాల మరణం కారణంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మృతికి హనుమాన్ టీం సంతాపం తెలియజేశారు. త్వరలోనే ఓ డేట్ చూసి టీజర్ రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించి త్వరలో కొత్త డేట్ తో ప్రకటన రానుంది.

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కింది హను-మాన్ సినిమా. ఈ పాన్ ఇండియా సినిమాను ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు.

     

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics