Teaser talk of Naga Chaitanya’s ‘Thank You’

Wednesday,May 25,2022 - 05:37 by Z_CLU

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న 'థాంక్యూ' జులై 8న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అబ్రోడ్ లో బిజినెస్ మెన్ గా సెటిలయిన అభిరామ్ విజువల్స్ తో మొదలైన టీజర్ అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ , లవ్ స్టోరీస్ చూపిస్తూ ఎండయింది. చైతు సినిమాలో మూడు వేరియషణ్స్ ఉన్న లుక్స్ లో కనిపించనున్నాడని , అలాగే సినిమాలో మంచి ఎమోషన్ ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మూడు ప్రేమకథలతో అభిరామ్ సాగించిన ప్రయాణంతో సినిమా తెరకెక్కిందని టీజర్ లో చూపించారు. ఇక కథ గురించి పెద్దగా  తెలియకుండా సస్పెన్స్ క్రియేట్ అయ్యేలా 1 : 18 సెకన్లతో టీజర్ ని కట్ చేశారు.

టీజర్ లో " నీ లైఫ్ లో నీకు తప్ప ఇంకొకరికి చోటే లేదు","నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ" డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అలాగే పీసీ శ్రీరామ్ విజువల్స్ , తమన్ స్కోర్ , రొమాంటిక్ సీన్స్ టీజర్ ని ఎట్రాక్టివ్ గా మార్చాయి. ఓవరాల్ గా టీజర్ తో ప్రేక్షకుల్లో థాంక్యూ మీద అంచనాలు పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

నాగ చైతన్య సరసన రాశి ఖన్నా , మాళవిక నాయర్ , అవిక గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు . శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.వి.ఎస్.రవి కథ అందించాడు.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics