Team of SDT15 Grand welcomes to Sai Dharam Tej on the first day shoot

Tuesday,March 29,2022 - 01:01 by Z_CLU

కొన్ని నెలల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. తను కోలుకోవడానికి చాలా టైం పట్టింది కూడా. అయితే కొన్ని నెలల రెస్ట్ అనంతరం తేజ్ మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. మొదటి రోజు తేజ్ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ST15 సినిమా టీం తమ హీరోకి  వెల్కం బ్యాక్ సాయి తేజ్ అంటూ గ్రాండ్ గా వెల్కం చెప్పారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో  తొలి రోజు తేజ్ మిగతా నటీ నటులపై కొన్ని సన్నివేశాలు తీశారు యూనిట్.

తేజ్ కి వెల్కం బ్యాక్ చెప్పేందుకు సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన దర్శకుడు సుకుమార్ కూడా వచ్చి తేజ్ ని స్పెషల్ గా విష్ చేశారు. అలాగే ఆర్ నారాయణ మూర్తి కూడా సెట్స్ లో తేజ్ ని కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాయి తేజ్ తో కాసేపు సెట్స్ లో గడిపి వెళ్ళాడు. ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఒక వీడియో వదిలారు మేకర్స్.

తనపై టీం చూపించిన ప్రేమకి, గ్రాండ్  వెల్కమింగ్ కి తేజ్ ఫిదా అయ్యాడు. ట్విట్టర్ వేదికగా అందరికీ థాంక్స్ చెప్పుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బేనర్స్ పై  బి వి ఎస్ ఎన్ ప్రసాద్ , సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ మరిన్ని డీటెయిల్స్ చెప్పనున్నారు.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics