Tamannaah says she is recovering from Corona

Tuesday,October 06,2020 - 10:28 by Z_CLU

మిల్కీబ్యూటీ తమన్నకు కరోనా సోకిందంటూ గతం వారం ప్రచారం జరిగింది. అయితే దానిపై తమన్న రియాక్ట్ అవ్వలేదు. ఎట్టకేలకు తనకు Corona సోకిన విషయాన్ని కన్ఫర్మ్ చేసిన Tamanna.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు ప్రకటించింది.

"నేను, మా యూనిట్ సెట్స్ లో చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడ్డాను. గతవారం నాకు కొద్దిగా జ్వరం వచ్చింది. టెస్టులు చేసి చూస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను."

ప్రస్తుతం తమన్నకు ఎలాంటి కరోనా లక్షణాల్లేవు. కానీ డాక్టర్స్ సలహా మేరకు ఆమె హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లింది. మరో 10 రోజుల తర్వాత మాత్రమే ఆమె షూటింగ్స్ కు అందుబాటులోకి వస్తుంది.