Suriya ShivaKumar , Bala Combo creating a huge buzz with Announcement

Tuesday,March 29,2022 - 12:01 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలా ఎదురుచూసిన కాంబో నుండి ఎనౌన్స్ మెంట్ రావడమే ఆలస్యం సోషల్ మీడియాలో భారీ బజ్ స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ అలాంటి బజ్ నే క్రియేట్ చేసి హాట్ టాపిక్ గా మారింది 'సూర్య - బాల' కాంబో.

తాజాగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు పద్దెనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ బాల నా సినిమాకు యాక్షన్ చెప్పబోతున్నాడు అంటూ సూర్య ఎగ్జైటింగ్ గా ట్వీట్ పెట్టాడు. గతంలో బాల దర్శకత్వంలో 'నంద', 'శివ పుత్రుడు' లాంటి సినిమాలు చేశాడు సూర్య. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం కలిశారు.

బాల సినిమా అంటే అందులో కథతో పాటు హీరో క్యారెక్టర్ కూడా వినూత్నంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యని బాల ఎలా ప్రెజెంట్ చేయనున్నాడు ? అసలు వీరిద్దరి కాంబో సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుంది ? అంటూ చర్చ నడుస్తుంది. షూటింగ్ మొదలైతే తప్ప సూర్య గెటప్ ఎలా ఉంటుందో తెలియదు. అప్పటి వరకూ ప్రేక్షకుల మైండ్ కి ఎగ్జాం పెడతాడు బాల.  సూర్య , జ్యోతిక ప్రెజెంట్స్ తో 2D ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. కృతికి ఇది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics