Sundeep Kishan Gully Rowdy first look released

Monday,April 05,2021 - 01:13 by Z_CLU

సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా గల్లీ రౌడీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కేవలం సందీప్ కిషన్ లుక్ మాత్రమే కాకుండా.. సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులందరితో మరో పోస్టర్ కూడా వదిలారు.

sundeep kishan gully rowdy 3

ఈ సినిమాకు ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సమస్యల వల్ల ఆ టైటిల్ ను తప్పించారు. దాని స్థానంలో గల్లీ రౌడీ పేరును ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, డైరెక్టర్‌ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

sundeep kishan gully rowdy 3

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా బ్యానర్లపై కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో.. కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుందంటున్నారు మేకర్స్