Sumanth coming with ‘Anaganaga Oka Rowdy’ !

Tuesday,February 09,2021 - 04:32 by Z_CLU

త్వరలోనే 'కపటధారి' సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న సుమంత్ హీరోగా 'అనగనగా ఒక రౌడీ' అనే మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రఫ్ లుక్ తో రౌడీ క్యారెక్టర్ చేస్తున్నాడు సుమంత్. తాజాగా సుమంత్ పుట్టిన రోజుని పురస్కరించుకొని సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. విశాఖపట్నం రౌడీ  'వాల్తేరు శ్రీను' గా షార్ట్ హెయిర్ , పంచెకట్టుతో ఉన్న సుమంత్ లుక్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వైజాగ్ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది. మను యజ్ఞ డైరెక్షన్ లో యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాను ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ఐమా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి  మార్క్ రాబిన్ మ్యూజిక్ కంపోజర్.