Sukumar supports BuchiBabu Sana for NTR’s Movie script

Thursday,July 28,2022 - 12:15 by Z_CLU

'ఆర్ ఆర్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా , ప్రశాంత్ నీల్ తో ఇంకో సినిమా చేయబోతున్నాడు. ముందుగా కొరటాల శివ 30వ సినిమా చేయడానికి రెడీ అవుతున్న తారక్ మరో వైపు బుచ్చిబాబుతో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాడ. వీరిద్దరి మధ్య ఇప్పటికే రెండు మూడు సార్లు స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ కోసం గురువు సపోర్ట్ తీసుకుంటున్నాడు బుచ్చిబాబు.

ప్రస్తుతం సుకుమార్ తో కలిసి థాయిలాండ్ లో బుచ్చి బాబు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సుక్కు ఐడియాలు , ఒపినీయన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు బుచ్చిబాబు. నిజానికి ఇంకా ఒక్క స్టార్ హీరో సినిమా కూడా చేయలేనప్పటికీ ఉప్పెన సక్సెస్ చూసి అవకాశం ఇచ్చాడు తారక. అందుకే బుచ్చిబాబు సీనియర్ ఐన సుకుమార్ సహాయం తీసుకుంటూ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.

బుచ్చిబాబు అండ్ టీం తో కలిసి సుకుమార్ థాయిలాండ్ లో ఎన్టీఆర్ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే హైదరాబాద్ వచ్చి పుష్ప ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకోనున్నారు. విజయనగరం బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు  పెద్ది అనే అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. బుచ్చి బాబు, ఎన్టీఆర్ కి ఫైనల్ నెరేషన్ ఇవ్వగానే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics