Sukumar gives a clarity on ‘Pushpa part 2’

Saturday,December 18,2021 - 04:22 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' నిన్న గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా గురించి తాజాగా మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు సుకుమార్.  పార్ట్ 2 గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ పుష్ప రెండో భాగంపై అంచనాలు పెంచేశాడు.

సుకుమార్ మాట్లాడుతూ " అసలు కథంతా పార్ట్ 2 లోనే ఉంటుంది. దానికి లీడ్ లా పుష్ప క్యారెక్టర్ తో చెప్పిన కథ ఇది. పార్ట్ 2 షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు పెడతాం. అక్టోబర్ లేదా వచ్చే ఏడాది మళ్ళీ ఇదే డేట్ కి పుష్ప 2 రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. పుష్ప ది రైజ్ లో ఉండే పాత్రలే అందులోనూ ఉంటాయి. కాకపోతే ఒకటి లేదా రెండు పాత్రలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ భాగానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీగా ఉంది. షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం. " అన్నాడు. అంతే కాదు అనసూయ పాత్రతో పాటు మిగతా పాత్రలకు రెండో భాగంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్తూ పార్ట్ 2 పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని తెలిపాడు. సుక్కు మాటలతో ఇప్పుడు పుష్ప రెండో భాగంపై అంచనాలు పెరిగాయి.

అలాగే 'పుష్ప' సినిమాను మరో సినిమాతో పోల్చకూడదని , 'పుష్ప' కమర్షియల్ ఫార్మేట్ లో నేచురల్ గా తీసిన ప్రయత్నమని చెప్పుకున్నాడు. దీన్ని KGF తోనో మరో సినిమాతో పోల్చడం సరికాదని అన్నారు.  ఇక సమంత స్పెషల్ సాంగ్ చేయనని చెప్పిందని, కానీ తనని కన్విన్స్ చేసి ఆ సాంగ్ చేయించానని ఆ సాంగ్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం 'పుష్ప ది రైజ్' కి భారీ కలెక్షన్స్ వస్తుండటం, నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ రావడం అలాగే హిందీ లో నాలుగు కోట్లు కలెక్ట్ చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు సుక్కు తెలిపాడు.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics