Story behind Kajal wedding lehenga

Thursday,November 05,2020 - 05:05 by Z_CLU

రీసెంట్ గా పెళ్లి చేసుకుంది చందమామ కాజల్. పెళ్లి డ్రెస్ లో ఆమె ధగధగ మెరిసిపోయింది.  కచ్చితంగా అది డిజైనరీ వేర్ అనేది అందరికీ తెలిసిందే. అయితే దాన్ని తయారుచేయడానికి ఎంత టైమ్ పట్టిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పెళ్లిలో కాజల్ ధరించిన లెహెంగాను తయారుచేయడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అంతేకాదు.. అచ్చంగా 20 మంది ఈ లెహెంగా తయారుచేయడంలో కష్టపడ్డారు. ఫ్లోరల్ పాట్రన్ లో ఉన్న జర్దోసీ వర్క్ చేయడానికి ఇంత టైమ్ పట్టింది. పూర్తిగా హ్యాండ్ వర్క్ తో చేసిన ఈ లెహెంగాలో కాజల్ అప్సరసలా కనిపించింది. ఫేమస్ డిజైనర్ అనామిక ఖన్నా, కాజల్ పెళ్లి దుస్తుల్ని డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టారు.