Story behind Chiranjeevi’s tonsured look

Friday,September 11,2020 - 05:10 by Z_CLU

ఒక్కసారిగా అందరికీ స్వీట్ షాకిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. గుండులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే అంతా అనుకుంటున్నట్టు అది ఒరిజినల్ గుండు కాదు. మేకప్ లో తయారుచేసిన గుండు ఇది. దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ఉంది.

ఈ మధ్య ఓ షో కోసం నాగార్జునకు స్పెషల్ మేకప్ వేసింది ముంబయికి చెందిన మేకప్ టీమ్. వాళ్ల వర్క్ Chiranjeevi కి నచ్చింది. పైగా గుండు కొట్టించుకుంటే చూడాలని ఎప్పట్నుంచో కోరిక ఉంది. అందుకే ప్రోస్తటిక్స్ సహాయంతో ఇలా గుండు మేకప్ వేయించుకున్నారు.

ఇలా నిజంగానే గుండు కొట్టించుకోకుండా.. గుండు లుక్ లోకి మారిపోయారు చిరు. ఈ నయా లుక్ చూసి ఏకంగా రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడంటే.. మెగా లుక్ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు.