Still Suspense continues on KGF2 Release

Saturday,June 26,2021 - 02:16 by Z_CLU

భారీ క్రేజ్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'KGF Chapter2'సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కరోన ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్స్ లోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మొన్నటి వరకు ఈ సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తెలుగులో ఆ సీజన్ పై మిగతా బడా సినిమాలు కన్నేయడంతో ఇప్పుడు మరో డేట్ సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారట మేకర్స్.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సినిమాను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేసే ప్లానింగ్ ఉన్నారట. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండటంతో త్వరలోనే కొత్త డేట్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. వచ్చే నెలలో #KGF2 రిలీజ్ పై పూర్తి క్లారిటీ రానుంది. మరి మేకర్స్ అనుకున్నట్టే సెప్టెంబర్ లోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తారా ? లేదా ఇంకా ఆలస్యం చేస్తారా ? చూడాలి.

kgf 2 yash

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను హాంబల్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో రవీనా టాండన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. అన్ని భాషల్లో మంచి వసూళ్ళు రాబట్టిన KGF సినిమాకు సీక్వెల్ గా రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics